Friday, July 1, 2011

పెళ్ళి అంటే?

పెళ్ళి అనేది జీవిత సహచరి తో ముడివేసే తంతు మాత్రమే కాదు ........
మనసులు అనే రెండు సూత్రాలను ప్రేమ అనే పసుపుతాడు తో నమ్మకం, త్యాగం, సఖ్యం
అనే మూడు ముళ్ళతో ఏకం చేసే తీయని కావ్యానికి శుభారంభం పెళ్ళి....
ఒకరి మీద మరొకరికి నమ్మకం వున్నప్పుడే బంధం అనేది ఏర్పడుతుంది.....
ఒకరి ఇష్టాల కొసం మరొకరు తమ ఇష్టాలను వదులుకున్నప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ ధ్రుడపడుతుంది....
ఆ ప్రేమని పదిలంగా అట్టిపెట్టేది మత్రం ఇద్దరి మధ్యన వున్న స్నెహమే........

Saturday, November 14, 2009

Monday, October 5, 2009

जिया जाए ना हम तेरे बिना|

कलियौ की मुस्कान में आप ही आप नज़र आते हैं
चाँद में भी आप ही नज़र आते हैं
जिदर देखे उधर आप नज़र आ रहे हैं
क्या करे हम ॥ आप के बगैर जी नहीं पा रहे हैं

Wednesday, September 16, 2009

ప్రేయసి

దివి నుండి జాలువారే ఝారివో
హృదయాన ఉప్పొంగే సంద్రానివో
నీలాల కాంతి పుంజానివో
వేకువ జామున విరిసే విరివో
దేవలోకాన మెరిసే మణివో
నా మది దోచిన ప్రియతమా......
నీ కాలి అందియల సవ్వడిలో నను ఓలలాడనీ.......

నిశి లో వెలిగే తారవో
అందచందాల అభిసారికవో
సోగ కళ్ళ సౌదామినివో
లేత గులాబీ అధర సోయగానివో
ఓ విశాలాక్ష వదనీ .... నా ప్రేయసి ......
నీ దరి చేరు దారి చూపోయి....

Wednesday, September 9, 2009

ప్రియనేస్తమా!!!

ఎక్కడ దాగున్నావు నా ప్రాణమా?
నింగి లో దాగి దోబుచులదుతున్నవా?
నీటిలో తేలిఆడుతున్నావా?
నా శ్వాసలొ ఊపిరి నీవై
నా హృదయం లో స్పందన నీవై
నా అడుగులలో నడక నీవై
నా మనసులోని మౌనము నీవై
అంతు చిక్కని భావం నువ్వై
నిరంతరం తలపులలో నిండి వేదించకు మా..
కనులముందుకన్పిన్చుమా....
స్నేహ హస్తాన్ని అందించుమా ....
ఓ ప్రియ నేస్తమా ....
విసిగిన వేళ నీ ఆదరం తో నను ఓదార్చు మా ....
నను చేరుకో నా ప్రాణమా.....